కపిల్ మిశ్రా పై కేజ్రీ భార్య ఫైట్ షురూ

రాజకీయం ఇప్పుడు భార్యల కోర్టులోకి వెళ్ళింది నిన్నటివరకు భర్తల మధ్య నడిచినపంచాయతి ఇప్పుడు భార్యల వరకు వెళ్ళింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసి ఈడ్చుకెళ్లి తీహార్‌ జైలులో పడేస్తానంటూ వ్యాఖ్యానించిన ఆప్‌ బహిష్కృత నేత కపిల్‌ మిశ్రాపై కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధపు ఆరోపణ చేసిన మిశ్రా భవిష్యత్‌ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అన్నిటికి కపిల్‌ మిశ్రా బాధ్యత వహిస్తాడా? అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి నల్లధనాన్ని తెల్లధనంగా కేజ్రీవాల్‌ మార్చుకున్నారని, ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించారని కపిల్‌ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ చేసిన తప్పులకు ఆయన కాలర్‌ పట్టుకొని తీసుకెళ్లి తీహార్‌ జైలులో పడేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ భార్య స్పందించడం కొత్త తరహా రాజకీయానికి తెర లేచినట్టయింది

]]>