ఆశా వర్కర్ల ఆశలు చిగురించాయి….

ఆశా వర్కర్లు నెలల తరబడి ధర్నాలు చేశారు.అయిన అరకొర జీతాలు అవి సరిగా అందేవి కావు వారి శ్రమకు తగ్గ ఫలితం ఉండేది కాదంటూ వాపోయేవారు కానీ ఇప్పడు సీఎం కేసీఆర్ వారికీ వరాల జల్లు కురిపించారు.గ్రామ స్థాయిలో సేవలందించే ఆశా వర్కర్ల నెల జీతం రూ. ఆరువేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో సమావేశమైన సీఎం కేసీఆర్.అంగన్ వాడీల స్థాయిలో ఆశా కార్యకర్తల జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు.ఆశా కార్యకర్తల జీతాలు మరోసారి పెంచుతామని హామీ ఇచ్చారు. ఆశ కార్యకర్తలు రెగ్యులర్ ఉద్యోగాలు కాదని,సొంత పనులు చేసుకుంటూ అదనపు ఆదాయం కోసం పనిచేసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు అత్యధికంగా జీతాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.గర్భిణీలకు నగదు సాయం, కేసీఆర్ కిట్ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

సమాజంలో ఆశా వర్కర్లు గౌరవంగా బతకాలన్నారు సీఎం. వారితో వెట్టి చాకిరి చేయించడం సరైంది కాదని, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంల పరిస్థితి మారాలన్నారు. గ్రామాల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు తీసుకోవాలని,త్వరలో భర్తీ చేయనున్న 1200 ఏఎన్‌ఎం నియామకాల్లో ఆశ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యం కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏడాదికి ఆరున్నర లక్షల ప్రసవాలు జరుగుతున్నప్పటికీ… ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం రెండున్నర లక్షలు మాత్రమే జరుగుతున్నాయన్నారు సీఎం.ముందు ముందు ప్రసవాల సంఖ్య పెరగనుంది అన్నారు అందుకని ఆస్పత్రుల్లో ఎక్కువ మంది స్టాఫ్ అవసరం ఉంటుందని,త్వరలోనే కొత్త పోస్టుల నియామకాలు జరుగుతాయి అన్నారు.

]]>