ఏషియన్ స్వప్న 70 ఎం.ఎం ప్రారంభం! 

rains-in-telangana

nagarjuna

ఏషియన్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో.. ఆధునిక హంగులతో రాజేంద్రనగర్ సమీపంలోని కాటేదాన్‌లో ఏషియన్ స్వప్న 70ఎం ఎం థియేటర్ శనివారం ప్రారంభమైంది. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రకాష్‌గౌడ్, నిర్మాతలు  సురేష్‌బాబు, సుధాకర్ రెడ్డి, ఏషియన్ ఫిలింస్ అధినేతలు నారాయణ దాస్, సునీల్ నారంగ్‌లతో పాటు థియేటర్ మేనేజర్ సదానంద్ తదితరులు పాల్గొన్నారు.
]]>