ప్రముఖ గాయని చిన్మయి కారును దొంగలు ధ్వంశం చేసి వెళ్లారు.చిన్మయి అమెరికా- శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ కార్యక్రమo లో పాల్గొన్నారు.ఆ టైమ్లో తన కారుని ఓ చోట పార్క్ చేయగా కొందరు గుర్తుతెలియని దుండగులు కారు అద్దాలను ధ్వంసం చేసి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.ఈ విషయాన్నీ చిన్మయి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ తరహా దొంగతనాలు ఆ చోట చాలా కామన్ అంటూ పోలీసులు తనకు చెప్పారని, తన వస్తువులేవో గుర్తించడానికే చాలా సమయం పట్టిందని ఈ సందర్భంగా చిన్మయి తెలిపింది. అయితే ఆ దొంగతనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. దాని ద్వారా పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారట.అబివృద్ది చెందిన దేశాల్లో కూడా దొంగలు చేతి వాటం చూపిస్తూనే ఉన్నారన్నమాట….
]]>