`మా అబ్బాయి` ఆడియో

ప్రేమ ఇష్క్ కాద‌ల్‌, ప్ర‌తినిధి, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, వంటి చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై బేబీ సాక్షి స‌మ‌ర్ప‌ణ‌లో కుమార్ వ‌ట్టి ద‌ర్శ‌క‌త్వంలో బ‌ల‌గ ప్ర‌కాష్ రావు నిర్మిస్తోన్న చిత్రం `మా అబ్బాయి`

చిత్ర నిర్మాత బ‌ల‌గ ప్ర‌కాష్ రావు మాట్లాడుతూ -“మా వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం `మా అబ్బాయి`. ల‌వ్, సెంటిమెంట్, కామెడి, యాక్ష‌న్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. శ్రీవిష్ణు న‌ట‌న సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌ సినిమాను మార్చి మొద‌టి వారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః థ‌మ‌శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వండాన రామ‌కృష్ణ‌, సంగీతంః సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంక‌టేష్, ఫైట్స్ రాబిన్ సుబ్బు న‌బ‌, కొరియోగ్రాఫ‌ర్స్ః ర‌ఘు, అజ‌య్, సాయి, స్వ‌ర్ణ‌, పాట‌లుః కందికొండ‌, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, సురేష్ బ‌నిశెట్టి, నిర్మాతః బ‌ల‌గ ప్ర‌కాష్ రావు,క‌థ‌,స్ర్కీన్ ప్లే,మాట‌లు,ద‌ర్శ‌క‌త్వంః కుమార్ వ‌ట్టి.]]>