`సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్` వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రినాధరావు నక్కిన `ఆయుష్మాన్ భవ చిత్రానికి కథ అందిస్తున్నారు.మారుతి టాకీస్- సి.టి.ఎఫ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 15వ తేదిన పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. అదే రోజున చిత్ర యూనిట్ మాధాపూర్ ఎన్ కన్వెన్ హాల్ లో కర్టన్ రైజర్ వేడుకను నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమం లో టైటిల్ లోగో లాంచ్ చేయనున్నారు.ఇలా సినిమా ప్రారంభం తర్వాత కర్టైన్ రైజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.ప్రముఖ హీరోయిన్ల డ్యాన్సులతో వేదిక మరింత కళకళలాడనుంది. ఈ వేడుకకు పలువురు దర్శక, నిర్మాతలు హజరు కానున్నారు.
]]>