శంషాబాద్ వ‌ద్ద " బేవర్స్" ఫైట్ చిత్రీక‌ర‌ణ‌

bevars ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తోంబై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. రమేష్ దర్శకత్వం లో సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్ ప్రత్యెక పాత్రలో నటిస్తున్నారు.

యూత్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. తండ్రీ, కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు అందరినీ కంటతడి పెట్టిస్తాయి. ఈ చిత్రంలో ముద్దపప్పు ఆవకాయ ఫేం అభి, మధునందన్, అమృతం వాసు, విజయభాస్కర్, వెంకీ, షేకింగ్ షేషు, ఆర్జే హేమంత్, రాకేష్, ఫణి, వరంగల్ భాష తదితరులు నటిస్తున్నారు.

]]>