ట్రైలర్ తో ఒక ఊపు ఊపేసింది బాహుబలి 2 ,ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను వర్చువల్ రియాల్టీలో ప్రసారం చేస్తోంది.‘బీబీ360సీసీ’ పేరుతో అభివృద్ధి చేసిన 32 కెమెరాలున్న సూపర్ వీఆర్ క్యాప్చరింగ్ కెమేరాతో రెండు బిట్లను చిత్రీకరించింది.ఈ సన్నివేశాలను చూసినప్పుడు ప్రేక్షకుడికి తానే ప్రభాస్ పక్కన ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది.యుద్ధ విన్యాసాలు జరుగుతున్నా టైం లో మనం అక్కడే ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది.గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ), బీబీ360సీసీ కెమేరా, లూమ్ సాఫ్ట్వేర్లను కలిపి ఉపయోగించడం ద్వారా అత్యద్భుతమైన నాణ్యతతో వర్చువల్ రియాల్టీ సన్నివేశాలను సిద్ధం చేయవచ్చునని ఏఎండీ అంటోంది.ఈ అద్భుతమైన ప్రతిభ ఎలా ఉండ బోతోందా అని ఆసక్తితో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ప్రముఖులు,పలువురు నిర్మాతలు ప్రత్యేక ఆసక్తి తో ఫంక్షన్ కి హాజరయ్యారు.రాజ్ మౌళి అద్బుత ప్రతిభ ఎలా ఉండబోతోందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
]]>