భావన పెళ్లి డేట్ ఫిక్స్….

జీవితం లో ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కున్న తర్వాత సిని నటి భావన మంచి జీవితం లో కి అడుగు పెట్టబోతోంది. భావన వివాహం నిర్మాత నవీన్‌తో జరగనుంది.కొన్ని రోజుల క్రితం వీరిరువురికి నిశ్చితార్ధం జరగగా, ఇప్పుడు వీరిద్దరి పెళ్లికి ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశారు కుటుంబసభ్యులు. అక్టోబర్‌ 27న భావన, నవీన్‌ల పెళ్లి జరగనున్నట్లు ఆమె తల్లి పుష్ప వెల్లడించారు.ఇక భావన పెళ్లి తమ సొంత ఊరు తిరుచ్చూరిలో జరగనుందని, పెద్దగా ఆర్భాటాలేమీ లేకుండా నిరాడంబరంగా ఈ శుభకార్యాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు, సన్నిహితులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఇక సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరెవరిని ఆహ్వానించాలన్నది భావననే నిర్ణయించుకుంటుందని ఆమె తెలిపింది.

]]>