కాషాయాన్ని గెలిపించింది ఎర్ర బుగ్గా? ఆప్ ఓడింది స్వయం కృతాపరాధమా

మునిసిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు దాదాపు ఖాయం అయినట్టే ఆమ్ ఆద్మీ పార్టీ  కనీసం కనుచూపు మేరలో కూడా లేకుండా పోయింది, ఇక కాంగ్రెస్ కొద్దో గొప్పో ఢిల్లీ లో మునిసిపల్ వోట్ బ్యాంకు ని కాపాడుకో గలిగింది మొత్తం 270 స్థానాల్లో పోటీ జరగ్గా ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ 184,కాంగ్రెస్ 30ఆప్ 46 స్థానాల్ని ఇతరులు 10 స్థానాల్ని  కైవసం చేసుకొన్నారు. ఐతే ఆమాంతం బీజేపీ ఏమి ఎన్నికలో గెలుపొంది లేదు అనేది స్ఫష్టం గా తెలుస్తోంది,గత పదేళ్లుగా అధికారం ఉన్న బీజేపీ, ప్రజల అభిమానాన్ని చూర గొని మరో సారి ఢిల్లీ మున్సిపాలిటీని దక్కించుకుంది

కేజ్రీవాల్ ప్రభుత్వం అంతగా ఢిల్లీ ప్రజల్ని ఆకట్టుకోలేక పోవడం ప్రధాన కారణం కాగా ఢిల్లీ లో తీవ్రమైన  కాలుష్యం వంటి సమస్యలు పరిష్కరించ లేక పోవడం కేజ్రీ వాల్ ఓటమికి ప్రధాన కారణం కావడం, తాజా గా మోడీ ప్రభుత్వం ఎర్ర బుగ్గ ని నిషేధించటం  ఢిల్లీ ప్రజల పాలిట వరం గా మారింది . ఢిల్లీలో ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ జాం దానికి తోడుగా వీఐపీ  వాహనాల కారణం గా పోలీస్ లు ట్రాఫిక్ ఆపేయడం ఎలా ప్రజలలో తీవ్రఅసహనం గూడు కట్టుకొని వుంది  ప్రభుత్వం తాజాగా తీసుకొన్న ఎర్ర బుగ్గ నిర్ణయం ఢిల్లీ వాసుల్ని కొంత మేర ఆనందాన్ని ఇచ్చిందనే అనాలి,ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపు సాధించి మంచి ఊపు మీదున్న భారతీయ జనతా పార్టీ  ఢిల్లీ ఎన్నికల్లో గెలుపును సాధించటం సునాయాసమైంది .ప్రజామోద కార్య క్రమాల్ని తీసుకొంటున్న భారతీయ జనతా పార్టీ జమిలి ఎన్నికల్లో కూడా ఇదే ఊపు కొనసాగిస్తుంది అనడం లో సందేహం లేదు ఇప్పటికే ఆ పార్టీ నాయకుడు అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ మొదలుపెట్టారు  .ఇదిలా  ఉండగా ఈ విజయం బీజేపీ విజయం కాదని ఈవీఎం ల మాయాజాలం అంటూ మళ్ళి గోల మొదలు పెట్టారు ..

]]>