కమలం -సెల్వం వెరసి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠమా !

కమలదళం ,పన్నీర్ సెల్వమ్ ఒక్కటేనా ఆవునేమో అనక  తప్పేలా లేదు ఎందుకంటే తమిళనాడు  రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ  తరపున జెండా భుజాన వేసుకొనే వారే లేరు ప్రస్తుతం ద్రావిడ రాజకీయాల్లో జయలలిత మరణం తరువాత నెలకొన్న సంక్షోభం తెలిసిందే.ఇదిలా ఉండగా జయలలిత దగ్గర నమ్మకస్తుడిగా పేరు పొందిన సెల్వమ్ కు ప్రజల్లో మంచి మద్దతుందని  కేంద్ర నాయకత్వం బలం గా నమ్ముతోంది అందుకే పరోక్షం గా సెల్వని మద్దతిస్తూ 2019 ఎన్నికల్లో సెల్వాన్ని ముఖ్యమంత్రి ని చేసేయాలని ఆలోచన లో ఉందట ..ఇదిలా ఉండగా ప్రజల మద్దత్తు ఉన్న వారికే మద్దుతు ఉంటుంది తద్వారా సుస్థిర ప్రభుత్వానికి మద్దత్తు ఇస్తున్నట్టు బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది,

ఇదిలా ఉంటె aaidmk ఎంపీ, ఎమ్మెల్యే లు అందరూ ఎలాగూ సెలవనికే మద్దతు ఇచ్చేందు మొగ్గు చూపుతారు , ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ఇష్ట పడే అవకాశం తక్కువ కాబట్టి పన్నీర్ కి మద్దతు ఇవ్వడం ద్వారా రానున్న లోక్సభ ఎన్నికల్లో లాభపడేలా ప్రణాళిక రచిస్తూ తమిళనాడులో కనీసం 15 ఎంపీ స్థనాల్ని కైవసం చేసుకొని తమిళనాడులో కమల వికాసం కోసం పావులు కదుపుతోంది, ఈ పధకం ప్రకారమే డీఎంకే కి ఎలాంటి అవకాశం ఇవ్వ కుండా తమిళ రాజకీయాన్ని సెల్వని సపోర్ట్ ఇవ్వడం ద్వారా కధ ని నడిపిస్తోంది.ఐతే దీనికి కూడా కారణం లేక పోలేదు అమ్మ జయలలిత బ్రతికి ఉన్న రోజుల్లో సెల్వం చూపించిన కృతజ్ఞతే మోడీ మనసు ను సెల్వం దోచడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అదే విధం గా శశికళ మీద వున్న దురభిప్రాయం కూడా  తోడైంది..

]]>