బాలీవుడ్ నటి,హాట్ సుందరి రాఖీ సావంత్ అరెస్టయింది.పోయిన సంవత్సరం ప్రైవేట్ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో రామాయణం రాసిన వాల్మీకి మహర్షి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందంటూ కేసు నమోదవ్వడంతో పంజాబ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఆమె చేసిన వ్యాఖ్యలు తమను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని వాల్మీకీ కులస్తులు ఫిర్యాదు చేయడంతో.పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం ముంబైలో అరెస్టు చేశారు.సంవత్సరం నుంచి కేసు విచారణకు హాజరుకావాలని పదే పదే సమన్లు పంపినా ఆమె రాకపోవడంతో ఆమె పై వారంటు జారీ అయింది.
]]>