పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ ఏకంగా 87 మంది ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలపై ఆరేళ్లపాటు నిషేధం విధించింది ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ. నిషేధానికి గురైనవారిలో అత్యధికులు ఎన్నికల సమయంలో పార్టీ గీతదాటి, రెబల్స్‌గా పోటీచేసినవారే కావడం గమనార్హం. ఈ మేరకు యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ విద్యాసాగర్ సోన్కార్ వెల్లడించారు. పార్టీకి వాళ్లు ద్రోహం చేయాలనుకున్నారు, అందుకు సంబంధిత ఆధారాలను పరిశీలించిన తరువాతే వాళ్లను బయటికి పంపామని సోన్కార్ అన్నారు.
]]>