రణబీర్ తన ఇద్దరు గాళ్‌ఫ్రెండ్స్‌కి టాటా చెప్పి,కొత్త అమ్మాయితో జత కట్ట బోతున్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గతంలో రణబీర్ బాలీవుడ్ కథానాయికలు దీపిక పదుకొన్, కత్రినకైఫ్లతో ఎఫైర్ నడిపించాడు.అయితే ఆ ఇద్దరితో కాలక్రమంలో తెగతెంపులు చేసుకున్నాడు. మొన్నటివరకూ కత్రినతో సహజీవనం చేసిన రణబీర్ ఇటీవలే తనతో ఎఫైర్ కట్ చేసుకున్నాడు.ప్రస్తుతం ఒంటరిగానే బ్యాచిలర్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడు.
అయితే రణబీర్ ఆ ఇద్దరిలో ఎవరో ఒకరినిపెళ్లాడడం లేదా సినీఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని తమ ఇంటికి కోడలిని చేసుకోవడం రణబీర్ తల్లి నీతూకి అస్సలు ఇష్టం లేదట. అందుకే లండన్‌కి చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెను కొడుకు కోసం సెలక్ట్ చేసింది. ఇటీవలే లండన్ వెళ్లి అమ్మాయి ని చుసివచ్చారు. ఆల్ మోస్ట్ మాటలు కూడా ఐపోయినట్లే.స్వేచ్ఛా జీవితాన్ని ఎంజాయ్ చేసిన రణబీర్ ఒక ఇంటి వాడవుతున్నాడన్నమాట.
]]>