ఈ అద్భుతం మీరు చేయలేరా !…రేవంత్‌రెడ్డి

ఖమ్మంలో రైతు దీక్షకు దిగిన తెలుగుదేశం కార్యకర్తలు.సత్తుపల్లి ఏంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్య  తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి.ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మిర్చి రైతుల పండించిన కారానికి కళ్ళు మండి కేసీఆర్ చూపించుకోవడానికి డిల్లీ వెళ్లారoటు కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా విమర్శలు గుప్పించిన రేవంత్‌రెడ్డి.సీఎం కేసీఆర్ రూ.కోటి విలువైన పంట పండిస్తారు.మంత్రి కేటీఆర్ ఒక ఐస్ క్రీమ్ రూ.5.5 లక్షలకు అమ్ముతారు.మంత్రి హరీష్‌రావు ఓ బస్త మోస్తే రూ.6.5 లక్షల సంపాదిస్తారు.ఎంపీ కవిత అరగంట చీర‌లు అమ్మితే రూ.10 ల‌క్షలు వ‌స్తాయి,ఇన్ని గొప్పగొప్ప అద్భుతాలు చేసే మీరు,ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్న మీరు,అన్ని రకాల తెలివితేటలు ఉన్నమీరు,ఖమ్మం మార్కెట్ యార్డ్‌లో రూ.10 వేలకు క్వింటాల్ మిర్చి అమ్మలేరా అంటూ ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి.మూడు రోజులు యర్ద్ కి సెలవలు ప్రకటించిన తర్వాత దళారులు వ్యాపారస్తులు కలిసి మూడు రోజులు తిండి తిప్పలు లేకుండా ఇక్కడుంటారా ౩౦౦౦ వేలకు మాకు అమ్ముతారా అంటూ యార్డ్ బయట కాంటాలను పెడితే అప్పుడు కడుపు మండిన రైతు తిరగబడ్డాడు అంతే తప్ప రైతు తప్పు లేదంటూ  ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి.

]]>