తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై కలిసి పోరాడేందుకు తమ్మినేని పవన్‌తో మంతనాలు జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. 2019 ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయం కోసం సీపీఎం జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది.
కమ్యూనిస్టు పార్టీల వంటి భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పవన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్‌తో కలిసి పనిచేసే విషయంపై రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని,సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ్మినేని పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
]]>