బాబు నోట ఆ మాట !

నీతికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ని తానేన‌ని త‌న‌కు తానే ప్ర‌మోష‌న్ చేసుకునే ముఖ్యమంత్రి చంద్ర‌బాబు..ఇటీవ‌ల త‌ర‌చూ అవినీతిలో భార‌త‌దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశే నెంబ‌ర్ వ‌న్ అని శాస‌న‌స‌భ‌లో స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించుకున్నారు.నిప్పులేనిదే పొగ‌రాదంటారుకదా మరి అవినీతిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మ‌న‌సులో చాలా ఖ‌చ్చితమైన అభిప్రాయం వుంద‌ని ఈ మాటని బట్టి అర్ధం అవుతోంది ..అదే మాట‌గా బ‌య‌ట‌కొచ్చింద‌ని అంటున్నారు అభిమానులు సంక్షోభాల‌ను అవ‌కాశాలుగా మ‌ల‌చుకోగ‌ల అప‌ర‌చాణుక్యుడి నోటి వెంట‌..ఈ అవినీతిలో మొద‌టిస్థానం మాట‌లు వెనుక మ‌ర్మ‌మేంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌…

ఆవు చేలో మేస్తే దూడ గ‌ట్టున మేస్తుందా? చ‌ంద్ర‌బాబే అవినీతిలో రాష్ట్రాన్ని నెంబ‌ర్ వ‌న్ అంటున్నప్పుడు .త‌న‌యుడు లోకేష్‌బాబు ఊరుకుంటాడా? త‌న తండ్రి మ‌న‌సులో ఏముందో గ్ర‌హించిన ఈ కాబోయే మంత్రి..కాలం క‌లిసొస్తే..అవ్వ‌బోయే ముఖ్య‌మంత్రి కొన్నేళ్ల క్రిత‌మే నాన్నారు లాగానే త‌న మ‌న‌సులో మాట‌నూ బ‌య‌ట‌పెట్టారు.ఓ స‌భ‌లో ప్ర‌సంగించిన లోకేష్ “కుల పిచ్చి.. అవినీతి.. లంచ‌గొండిత‌నం.. స్వార్థ‌పూరితం..అక్ర‌మాల‌మ‌యం అయిన పార్టీ ఏదైనా వుందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్ర‌మే“..అంటూ సెల‌విచ్చారు. త‌న త‌ప్పును క‌నీసం గ్ర‌హించ‌లేని స్థితిలో వున్న ఈ.అవునా కాదా త‌మ్ముళ్లూ అంటూ ప‌చ్చ‌చొక్కాలేసుకుని..జాత‌ర‌లో బ‌లేసేందుకు సిద్ధం చేసిన మేక‌పోతుల్లాంటి కార్య‌క‌ర్త‌ల్ని ప్ర‌శ్నించారు. ఎంత బ‌లికి సిద్ధ‌మైన మేక‌పోతైనా..త‌న య‌జ‌మాని త‌ప్పుడు మాట‌ల్ని క‌ర‌తాళ‌ధ్వ‌నుల‌తో స్వాగ‌తించ‌లేరు క‌దా! త‌న ప్ర‌సంగ పాట‌వానికి ప‌చ్చ‌సైనికుల చ‌ప్ప‌ట్ల శ‌బ్దం ల‌య క‌ల‌ప‌లేద‌ని కూడా యువ‌రాజుకు అనుమానం రాలేదు.

చంద్ర‌బాబు శైలిలోనే చెప్పాలంటే.. వాట్స్ గోయింగ్ ఆన్‌..మ‌న‌మంతా ఎక్క‌డికి పోతున్నాం.. న‌వ్యాంధ్రను న‌వ‌శ‌కం వైపు న‌డ‌పాల్సిన నాయ‌కుడు, ఆయ‌న త‌న‌యుడు క‌లిపి ఏం చేయ‌బోతున్నారు.. ఇట్స్ నాట్ క‌రెక్ట్‌!⁠⁠⁠⁠

]]>