అమెరికా లో రాజమౌళిని పొగిడిన చంద్రబాబు…

ఆంద్ర అబివృద్దికి పెట్టుబడే లక్ష్యం గ ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే..  పర్యటనలో బాగంగా శాన్‌హౌజ్‌కు చేరకున్నారు.అక్కడ తెలుగు వారి గురించి ప్రసంగించారు…తెలుగు వాడికి దేనైనా సాదించే సత్తా ఉందని, ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలని కోరకుంటున్నానని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అక్కడ ప్రవాసాంధ్రులతో మాట్లాడిన చంద్రబాబు ఇవాళ ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా తెలుగువాళ్లు ఉన్నారని, రాజమౌళిని చూస్తే తెలుగువాడి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. కాలిఫోర్నియాలో ఇంతమంది తెలుగువాళ్లను చూస్తుంటే అమెరికాలో ఉన్నానా? లేక అమరావతిలో ఉన్నానా? అని అనిపిస్తోందని అన్నారు.

]]>