అసలే మండే యండలు ఇన్ని రోజులు కస్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం,7౦౦౦ ఉన్నమిర్చి ధర ౩౦౦౦ కు పడిపోవడం తో ఉదయం నుంచి నిరసన తెలుపుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదంటు ఖమ్మం రైతులు ఆగ్రహానికి గురయ్యారు.పెట్టిన పెట్టుబడులు రాకపోగా కనీసంకూలి మందం కూడా గిట్టేటట్లు లేదన్న వారి ఆవేదనను అర్ధం చేసుకోలేని అధికారులపై తిరగబడ్డారు.
రోడ్లపై వ్యాపారులు అమ్ముుతున్న మిర్చికి నిప్పంటించారు.వాటిని తూకం వేసే కాటాలను తీసుకొచ్చి ధ్వంసం చేశారు.మార్కెట్ యార్డు ఛైర్మెన్ కార్యాలయంను చుట్టుముట్టి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు.మిర్చి యార్డు పాలకవర్గం, అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
]]>