వైఫ్ షేరింగ్ రోజులు రానున్నాయా ?

పెళ్లికాని ప్రసాద్ లకు ఒక శుభ వార్త ..హలో కంగారు పడకండి మీకేం పిల్లని చూడలేదు జస్ట్ మీకు పెళ్ళికాలేదనే బాధనుంచి కొంచెం రిలీఫ్ ఇచ్చే మాట చెప్తున్నాం అంతే .మన దేశం లోమాత్రమే కాదు మన పక్క దేశం చైనా లోకూడా అబ్బాయిలకి అమ్మాయి లు దొరకడం లేదట, సో మీ బాధని షేర్ చేసుకోవడానికి చైనా వెళ్ళండి ..అయ్యో అలా ఫీల్ అవకండి ఏదో సరదాకి అన్నాను ..నిజానికి దేశం లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్త సమస్య అయ్యేలా ఉంది మేల్ ఫిమేల్ రేషియో మ్యాచ్ కాక పాపం పెళ్ళైన వాళ్లేమో ఎందుకు చేసుకున్నాం అని పెళ్ళానికి దూరం గాఉంటున్నారు, ఆడాళ్ళేమో ఇంకేం ఇంకా మేము కనలేం బాబోయ్ అని ఆపరేషన్స్ చేయించుకొంటున్నారు వెరసి ఫలితం భావి తరాలకి శాపం గా మారి మ్యాచ్ దొరకడం కష్టం ఐపోతోంది..అదే పిల్ల దొరకడం కష్టం గా వుంది.

ఒకపుడేమో ఆడపిల్ల వొద్దులే అని కనేందుకే తెగ మెలికలు తిరిగారు జనం ఆ సంగతి అందరికి తెలిసిందే ఫలితం గా కొత్త తరానికి బోలెడు కష్టాలు రావడం మాత్రమే కాదుపునరుత్పత్తికూడా తీవ్ర విఘాతం కలిగింది ఈ ప్రభావం చైనా లో కూడా అతలాకుతలం చేస్తోంది ఎదురు కట్నం ఇస్తాం అంటున్నా కూడా పిల్లే దొరకని పరిస్థితి.

చైనా లో అవివాహులైన యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది,రాబోయే 3 సంవత్సరాలలో 40 నుంచి 50 మిలియన్ లు వరకు పెరిగే అవకాశం ఉందట.ఇక్కడ వధువు లభించడం దుర్లభంగా మారిందిఅందుకే ఇతర దేశాల యువతుల్ని వివాహమాడే చైనీస్ సంఖ్య రోజురోజు కు పెరిగిపోతుంది.

పెళ్లి ఖర్చుకన్నా పెళ్ళాల ఖర్చు చైనాలో దండిగా పెరిగిపోయింది.ఆడపిల్లల తల్లిదండ్రులు పెద్దమొత్తాల్లోన్నే కన్యాశుల్కం డిమాండ్ చేస్తున్నారు.ఆర్థికంగా హై రేంజే లో ఉన్న యువకులు ఎంతైనా చెల్లిస్తారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ని పేదవారు పరిస్థితి ముసుకేసుకొని పడుకొనే పరిస్థితి ఈ దుస్థితి చూసి “వైఫ్ షేరింగ్ “తప్ప ఈ సమస్యకు వేరే పరిష్కారం కనపడట్లేదట..

]]>