గత 13 సంవత్సరాలుగా స్వర్గీయ అల్లు రామలింగయ్యా గారి పేరిట కళా పీఠీం జాతీయ పురస్కార కార్యక్రమాలు జరుపుతూ కళాకారులను సత్కరిస్తున్న విషయం తెలిసిందే ఐతే 2016 సంవత్సరానికి గాను సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు సారథ్యంలో డా..అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం దర్శకతర్న దాసరి నారాయణరావుగారికి అందజేశారు. దాసరి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న నేపథ్యంలో అవార్డును చిరంజీవి చేతులమీదుగా అల్లు అరవిందు అందుకున్నారు.
గత కొన్నేళ్ల నుంచి రామలింగయ్య గారి పేరిట సారిపల్లి కొండలరావు గారి అధ్యక్షతన ఈ అవార్డుల ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇకపై ఆయన సౌజన్యంలో నే అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్ పై ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందిఈ అకాడమీ ని చిరంజీవి ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు,పరుచూరి వెంకటేశ్వరరావు, కాసు ప్రసాద్ రెడ్డి, మన్నెం గోపీ చంద్ , అల్లు అర్జున్, అల్లు శిరీష్, సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
]]>