వరుణ్‌తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మిస్టర్` ఏప్రిల్ 13న విడుదలవుతోంది. వరుణ్‌తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న, బేబి భవ్య సమర్పిస్తున్న,శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మిస్టర్` ఏప్రిల్ 13న విడుదలవుతోంది.లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.ఇంకో పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ పాటను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇటలీలో తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రం లో ప్రిన్స్,నాజర్, మురళీశర్మ, తనికెళ్ళభరణి, చంద్రమోహన్, రఘుబాబు, ఆనంద్, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, నాగినీడు, హరీష్ ఉత్తమన్, నికితన్‌ధీర్, షఫీ, శ్రవణ్, మాస్టర్ భరత్, షేకింగ్ శేషు, ఈశ్వరిరావు, సురేఖావాణి, సత్యకృష్ణ, తేజస్విని తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, స్టైలింగ్ః రూప వైట్ల, లిరిక్స్ః కె.కె, రామజోగయ్య శాస్త్రి, కోడైరెక్టర్స్ః బుజ్జి, కిరణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ః కొత్తపల్లి మురళీకృష్ణ, కథః గోపీ మోహన్, మాటలుః శ్రీధర్ సీపాన, సంగీతంః మిక్కి జె.మేయర్, సినిమాటోగ్రఫీః కె.వి.గుహన్, ఎడిటర్ః ఎం.ఆర్.వర్మ, నిర్మాతలుః నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ఠాగూర్ మధు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః శ్రీనువైట్ల.