ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు రానున్న…… రాష్ట్రపతి

ఉస్మానియా యూనివర్సిటి వందేళ్ళ పండుగ సంబురాలు మూడు రోజులు పాటు జరగనున్న ఈ ఉత్సవాలనుఈరోజురాష్ట్రపతిప్రణబ్ముఖర్జీ,గవర్నర్నరసింహన్,ముఖ్యమంత్రికేసీఆర్ ప్రారంభించనున్నారు .ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలకు భారి బందోబస్తుతో ఏర్పాట్లుజరుగుతున్నాయి.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  మధ్యాహ్నం  12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు కి రానున్నారు. రాష్ట్రపతి ని గవర్నర్, సీఎం ఆహ్వానించనున్నారు. ఆతర్వాత12 గంటల45 నిమిషాలకు ఓయూకు చేరుకుంటారు.గంటన్నర సేపు ఓయూలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం పన్నెండున్నరకు జాతీయ గీతం పాడిన తర్వాత ఉత్సవాలు ప్రారంభమవుతాయి.రాష్ట్రపతి ప్రణబ్ వందేళ్ల వేడుక పైలాన్ ను ఆవిష్కరిస్తారు.ఎంపీ కే.కేశవరావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ మాట్లాడుతారు. గవర్నర్ మాట్లాడిన తర్వాత రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది.

ఓయూలో కార్యక్రమం పూర్తి కాగానే 1.30 గంటలకు అక్కడి నుంచి రాజ్ భవన్ కు వెళ్తారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు గచ్చిబౌలిలో గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు ప్రణబ్.  ఇక్కడి నుంచి బేగం పేట ఎయిర్ పోర్టుకు వెళ్లి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.

]]>