10న వ‌స్తున్న….`16 -ఎవ్రి డీటెయిల్ కౌంట్స్‌`

మార్చి 10న వ‌స్తున్న `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌`

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ పలు చిత్రాలు నిర్మితమయ్యాయి.త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `ధురువంగ‌ల్ ప‌దినారు` (డి-16) తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌` రీమేక్ పూర్తి చేసుకుని మార్చి 10న రిలీజ‌వుతోంది.

రెహ్మాన్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వ వ‌హించారు. ధృవ సినిమాలో అర‌వింద్ స్వామి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన సింగ‌ర్ కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేమ‌చంద్ర ఈ చిత్రంలో హీరో పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం హైలైట్‌. ఫ‌స్ట్‌లుక్ స‌హా ట్రైల‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది.

ఇటీవలే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ బృందం యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అద్భుత థ్రిల్ల‌ర్ చిత్ర‌మిద‌ని కితాబిచ్చింది. తెలుగులో పెద్ద విజ‌యం సాధించే చిత్ర‌మ‌ని సెన్సార్ స‌భ్యులు ప్ర‌శంసించారు. ఈనెల‌ 10న సినిమాని రిలీజ్ సంద‌ర్బంగా..

తమిళం లో హిట్ అయినట్లే ఈ సినిమా తెలుగులోనూ ప్రోక్షకుల మన్ననలను పొందుతుందని నమ్మకం ఉందని కార్తీక్ నరేన్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:సుజిత్ స‌రంగ్, సంగీతం: జాకేష్ బిజోయ్.

]]>