"రాధ"కు సెన్సార్ పూర్తి…

శతమానం భవతి వంటి మంచి ఫ్యామిలి ఎంటర్ ట్రైనర్ తో మంచి హిట్ సాదించిన తర్వాత శర్వానంద్‌ హీరోగా చంద్రమోహన్‌ చింటాడ దర్శకత్వంలో తెరకెక్కిన “రాధ” సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్‌. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ బోర్డ్‌ దీనికి క్లీన్‌ ‘యు’ను ఇచ్చింది. దీంతో ప్రమోషన్స్‌లో జోరును పెంచేసింది మూవీ యూనిట్‌.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్‌ సరసన లావణ్య త్రిపాఠి, అక్ష నటించగా రవి కిషన్‌, అశిష్‌ విద్యార్థి, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీకి రాడాన్‌ సంగీతాన్ని అందించాడు.

]]>