రాహుల్ వద్దు ప్రియాంకే ముద్దు

తాజా ఎన్నికల్లో ప్రజలు తీర్పు కాంగ్రెస్ పార్టీ ని డైలమాలో పడేశాయా ? అంటే అవును అనే అనాల్సి వచ్చేలా వుంది . సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ  నిన్నటి  ఫలితాలు చూసి  నవ్వాలో ఏడవాలో అర్ధం కాని పరిస్థితి లో కి నెట్టేశాయి ఫలితాలు చూస్తే  కాంగ్రెస్‌ నేతల కు దిమ్మతిరిగేలా చేసాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్  పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం ప్రధాన కారణమైతే ప్రచారం చేసి గెలుపుబాటలో నడిపించే సరైననాయకత్వం లేక పోవడం పరిస్థితులు పార్టీ శ్రేణుల్లో దిగాలు ప్రారంభమైంది. ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చే ప్రియాంక గాంధీ ఒక్కరే తమను గట్టెక్కించగలరని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ముక్తకంఠంతో అభిప్రాయ పడుతున్నట్లు సంకేతాలందుతున్నాయి కొంత మంది సీనియర్లు ఎలాగైనా సోనియాగాంధీకి ధైర్యంగా ప్రియాంకను ప్రచారానికి పంపాలంటూ విజ్ఞప్తి  చేయనున్నారు .

ఒకవేళ ప్రచారానికి రాహుల్‌ వస్తే తమ గెలుపు డౌటేనని సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో భయం ఆవరించింది. కులం కార్డు ప్రయోగిద్దామంటే పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న ఒక్కలిగ నేత, మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతుండడంతో కాంగ్రెస్‌ నేతలను గందరగోళంలో పడేసింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్‌ నుంచి సీనియర్లు ఒక్కొక్కరే పార్టీ నుంచి జారుకుంటూ ఉండడంతో నైరాశ్యం అడుగడుగునా కనిపిస్తోంది. 5 రాష్ట్రాల తర్వాత బీజేపీకి తదుపరి టార్గెట్‌ కర్ణాటకగా ఉంది. రాష్ట్రంలో మళ్ళీ గెలుపు సాధించి దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ నేతలు ఉవ్విళ్ళూరుతున్నారు. పార్టీ విజయాల వ్యూహకర్తగా ఉన్న జాతీయ అధ్యక్షుడు అమితషా బెంగళూరులో కనీసం నెల రోజులు తిష్టవేసే అవకాశాలున్నట్లు,ఓబీసీ వర్గాలకు అత్యధిక టికెట్లు కేటాయించడం ద్వారా కర్ణాటకలోనూ చక్రం తిప్పాలని బీజేపీ జాతీయ నేతలు భావిస్తున్నారు.
]]>