కూల్ జాకెట్ వచ్చేసింది…….

సమ్మర్ వస్తోందని బయపడాల్సిన రోజులు పోతునాయి.ఇంట్లో ఉంటేనే ఫ్యాన్స్,ఏ సిలు బయటకు వెళ్తే కూడా చల్లగా ఉండేలా జాకెట్ లు తయారు చేశారు.బయటి ఉష్ణోగ్రతతో పోలిస్తే 20 డిగ్రీల వరకూ శరీరాన్ని చల్లగా ఉంచే ఏసీ జాకెట్ మార్కెట్లోకి వచ్చేసింది. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ వీటిని ఆవిష్కరించారు.చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంచే వీటిల్లో రెండు బటన్ లు ఉంటాయి.బ్యాటరీతో నడిచే కూల్, హాట్ ఎయిర్ ఫ్యాన్స్ ఉంటాయి. ఓ ఎంఐటీ గ్రాడ్యుయేట్ ‘క్లయిమెట్ గేర్’ సాంకేతికతను అభివృద్ధి చేయగా, దీని సాయంతో ఈ జాకెట్ ను తయారు చేశారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ జాకెట్ తయారీకి సహకరించింది. అతి త్వరలో ఈ జాకెట్లు వినియోగదారులకు అందుబాటులో రానునాయి,ఫుల్ స్లీవ్ జాకెట్ రూ. 25 వేలుగా ఉండగా, హాఫ్ జాకెట్ రూ. 18 వేల వరకూ ఉంటుందని సమాచారం.

]]>