ప్రాణం పోయేవరకు ప్రేమించుకున్నారు …

ప్రేమ గుడ్డిది  అంటుంటారు ఇలాంటివే అనుకుంట బహుశా కానీ జీవితంలో అచ్చట ముచ్చట అన్ని అయిపోయిన వేరొకరు మరొకరు జీవితాన్ని ఇప్పుడిపుడే తెలుసుకొంటున్న వారు ఇంకొకరు ఏదేమైనా ఇద్దరు ఒకరికారు ఇష్ట పడ్డారు కాబట్టి ప్రేమికులు అనే పదాన్నే వాడక తప్పదేమో !ఆ ప్రేమికులు బలన్మరణానికి పాల్పడ్డారు.వివాహిత స్త్రీతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.అయితే వివాహితతో కలిసి యువకుడు గ్రామం విడిచి వెళ్ళిపోయారు. కారణాలు తెలియదు కాని వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారట.

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామానికి చెందిన మండవ వినయ్ అనే యువకుడు గుంటూరు జిల్లాలోని వినుకొండలో ఇంటింటికి స్టీల్ సామాన్లు విక్రయించేవాడు. వినుకొండలోనే ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉండేవాడు.అయితే ఈ క్రమంలోనే వినుకొండకు చెందిన ఎస్ కె జీనత్ తో వినయ్ కు పరిచయమేర్పడింది. జీనత్ కు చిన్నతనంలోనే సైదుల్లా అనే వ్యక్తితో వివాహమైంది. ఆమెకు ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు.

వినయ్ , జీనత్ ల మధ్య పరిచయం వారిద్దరి మద్య ప్రేమకు దారితీసింది.వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.రెండు రోజుల క్రితం వారిద్దరూ వినుకొండను వదిలేసి నెల్లూరుకు వెళ్లారట అయితే వారిద్దరూ ఏం ఆలోచించారో తెలియదు. శనివారం నాడు నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలోని రైలు పట్టాలపైకి చేరారు.గూడ్స్ రైలుకు ఎదురెళ్ళారు.వీరిని పట్టాలపై గమనించిన స్థానికులు, ప్రయాణీకులు పెద్దగా కేకలు వేశారు, రైలు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.వినయ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి …!

]]>