అక్కడ గోవుని చంపితే ఉరి తీస్తారు….

హిందువులు పుజించే గోవులను చంపకూడదు అని ఇంతవరకు చాల చట్టాలు,శిక్షలు వచ్చాయి ఐన కొన్ని ప్రాంతాలలో గోవుల ప్రాణాలు బలి తీసుకుంటూనే ఉన్నారు. గుజరాత్ రాష్ట్రం లో గోసంరక్షణ కోసం యావజ్జీవ శిక్ష విధించేలా  చట్టాన్ని తీసుకొచ్చింది.గోసంరక్షనే ముఖ్య ద్యేయం గా ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ ఇంకాస్త ముందుకు వెళ్ళి కటినమమైన శిక్షనే అమలు చేసారు.అక్కడ గోవును చంపితే ఉరితీస్తామంటున్నారు.గో హత్యలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తామని,దీనికి తగిన చట్టాన్ని త్వరలోనే తీసుకురానున్నం అని రమణ్ సింగ్ అన్నారు.ఇంతకు ముందు కూడా గో సంరక్షణ కోసం బారి బద్రతనే ఏర్పాటు చేసారు. ఛత్తీస్ గఢ్ లో కబేళాలపై నిషేధం ఉంది.ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిషేధం.ఎవరైనా చట్టాన్ని దిక్కరిస్తే రూ.50000 జరిమానా విధిస్తారు.ఇప్పుడా చట్టానికి మరింత పదును పెడుతున్నారు. గోహత్యకు పాల్పడితే, రూ.50వేల జరిమానా లక్ష నుంచి 5 లక్షల వరకు చేయనున్నట్టు తెలుస్తోంది.పూర్తిగా చట్టాన్ని మార్చనున్నారు.

]]>