ఆమె రాసిన లేఖ ..ఆయనకు బలం అవుతుందా ?

పార్టీ లు ఫిరా యించటం ఈ మధ్య కామన్ ఇష్యూ అయ్యింది, అటు తెలంగాణా లో ఇటు ఆంధ్ర లో మాత్రమే క్కాడు బైట ఉన్న అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది.ఐతే ఇదేం కొత్తగా వచ్చిన సంస్కృతి  కాదనేది అందరికీతెలిసిన విషయమే , ఐతే ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితి కొంత చిత్రంగా  నే వుంది ,తెలంగాణ లో కూడా ఇదే పరిస్థితి , కానీ రాజకీయ సమీకరణ ల కోసం కొత్త దారులు తొక్కాల్సి రావడం పరిపాటిగా మారుతూ నే చివరికి సంప్రదాయం అనే రేంజ్ కి వెళ్లినా ఆశ్చర్య పడాల్సిన అవసరo  లేదనే చెప్పాలి,

తాజా గా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ  జరిగిన సందర్భం లో అధికం గా మంత్రి పదవులు వైస్సార్సీపీ నుంచి ఫిరాయించి వచ్చిన వారికే  ఇచ్చారనేది జగన్ వాదన ఇది నచ్చని అయన  ఫిర్యాదులు చేయడానికి సిద్ధమవుతున్నారు ..ఇది ఇలా ఉండగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వాదన ఇంకొక లా వుంది ఒక పార్టీపై గెలిచి, మరో ప్రభుత్వంలో చేరటం సరికాదంటూనే ఒక నాయకుడి కోసం చట్టాలను మారుస్తామా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, గోవా వంటి చోట్ల బిజెపి కూడా ఇటువంటి రాజనీతిని వాడిన  విషయం తెలిసిందే .తాజాగా వెంకయ్య మాటలకు స్పందించిన దగ్గుబాటి పురందేశ్వరి చట్టాలు మార్చాలంటూ ఆమె కేంద్రానికి లేఖ రాశారు.టిడిపి ప్రభుత్వంపై విమర్శలు చేయటం జరుగుతూనే ఉంది.అయితే ఈ క్లిష్ట సమస్యలోనూ చిన్నమ్మ లేఖ రాశారంటే దాన్ని కేవలం వ్యక్తిగత చర్యగా చూడటానికి లేదు. దీన్ని బట్టి చూస్తే చిన్నమ్మ లేఖ కూడ కొంత బలాన్నిస్తుందేమో మరి ..!

 ]]>