చైనాలో దూసుకుపోతున్న దంగల్‌…

తన ఆశయ సాదన కోసం కుతుర్లనే కొడుకులు గా మార్చి కుస్తీ పోటిలకు పంపి విజయం సాదించిన ఒక తండ్రి కథ దంగల్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పొరుగు దేశాలలో తోలి అత్యధిక వసూళ్లు సాధించిన భారత సినిమాగానూ చరిత్రలో అదొక హిస్టరీ నే క్రియేట్ చేసింది.

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ నటించిన దంగల్‌ చైనాలోనూ దూసుకుపోతుంది. 7వేల స్క్రీన్లలో విడుదలైన తొలిరోజే రూ.15 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం తొలి వారం రోజుల్లో ఊహించని వసూళ్లతో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తొలి వారంలో రూ. 187.42 కోట్లతో దంగల్ హవా కొనసాగిస్తోంది. దీంతో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారత సినిమాగానూ ‘దంగల్‌’ నిలిచింది. ఈ వివరాలను బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు.

నాలుగు రోజుల్లో రూ. 120 కోట్లు రాబట్టిన దంగల్ తొలి వారాంతానికి రూ.187.42 కోట్ల వసూళ్లు సాధించింది. ఇదిలా ఉంటే గతంలో ఆమీర్‌ పీకే చిత్రంలో చైనాలోరూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. చైనాలో దంగల్‌ సినిమా విడుదల చేయడానికి ముందు దాని ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్‌డు నగరాల్లో అమీర్ ఖాన్ పర్యటించడం మూవీ కి కలిసొచ్చిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ వసూళ్లపై అమీర్‌, దర్శకుడు నితీశ్‌ తివారీలు చైనా ప్రేక్షకుల అభిమానంపై హర్షం వ్యక్తంచేశారు.

]]>