తెలంగాణ పోలీసులు నకిలీ ఐఎస్ వెబ్సైట్ సృష్టించి ముస్లిం యువతను టార్గెట్ చేస్తున్నారని దిగ్విజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే.నకిలీ వెబ్సైట్ ఆధారంగా కొందరిపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.ఈ వ్యాఖ్యలు పై….. “ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదంటూ ఘాటుగా సమాధానం చెప్పారు కేటిఆర్,తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల పై స్పందించారు. తప్పులు చేసిన వారిపై మాత్రమే కఠిన చర్యలు తీసుకుంటున్నాం అని స్పష్టం చేశారు. మేం ఎక్కడా దిగ్విజయ్ చెప్పినట్టు చేయడం లేదన్నారు.
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.ఆయనకు తీవ్ర వ్యతిరేకత రావడం తో దిగ్విజయ్ స్పందించి ఆయన చేసిన వ్యాక్యలకు వివరణ ఇచ్చారు.
దిగ్విజయ్‌సింగ్ ట్వీట్స్‌పై వివరణ ఇచ్చారు…
దిగ్విజయ్‌సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వ్యతిరేకత ఎక్కువ అవుతుండగా, తాజాగా తన ట్వీట్స్‌పై వివరణ ఇచ్చారు. వివిధ సందర్భాల్లో తనకు అందిన సమాచారం ఆధారంగానే తాను ట్వీట్స్ చేశానని చెప్పారు. తెలంగాణ పోలీసులు ముస్లిం యువతను రెచ్చగొడుతూ ఐసిస్‌వైపు వెళ్లేలా చేస్తున్నారన్న తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూనే, క్లారిఫికేషన్ ఇచ్చారు దిగ్విజయ్ సింగ్.
యాంటీ టెర్రర్ స్క్వాడ్ మీటింగ్‌లో ఈ విషయంపై చర్చ జరిగిందని, ఆ సమాచారాన్ని బేస్ చేసుకొనే తాను తెలంగాణ పోలీసులపై ట్వీట్స్ చేసినట్టు చెప్పారు. ముస్లిం యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా తెలంగాణ పోలీసులు చేపట్టిన చర్యలు అభినందించదగ్గవే అయినా వాళ్లు ఎంచుకున్న మార్గం మాత్రం సరైనది కాదని ఆయన అన్నారు.
]]>