టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఇతర భాషల్లో కూడా సినిమాలు నిర్మించాలనే కోరిక ఉందనే మాట చిత్ర వర్గాల్లో వినిపించేది ఇప్పుడు ఆ మాటే నిజం కాబోతోంది. గతంలో శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్లో భారతీయుడు-2ను ప్లాన్ చేసినా కార్య రూపందాల్చలేదు . ఇప్పుడు తన రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ చిత్రాన్ని బాలీవుడ్ దర్శక నిర్మాత నిఖిల్ అద్వానీతో కలిసి హిందీలోకి రీమేక్ చేయబోతున్నారట.
‘హేట్ స్టోరీ 4’ దర్శకుడు మిలాప్ ఝవేరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట. బాలీవుడ్ దర్శక-నిర్మాతల ద్వయం ఇటీవల ‘ఎవడు’ చిత్రాన్ని చూసారని..ఈ చిత్రం హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగట్లు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేస్తారని సమాచారం. ఈ సినిమాలో ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ పాత్రలో ఎవరు నటిస్తారు. హీరో రామ్ చరణ్ రోల్ కోసం ఎవర్ని ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది .