దువ్వాడ ధర అదుర్స్

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా త్వరలో రాబోతున్న చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో.. ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. రేపు  టీజ‌ర్ కూడా రాబోతోంది. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శుక్ర‌వారం డీజే టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌డానికి చిత్ర‌బృందం రెడీ అయిపోయింది. టీజ‌ర్ త‌ర‌వాత అంచ‌నాలు ఎలా ఉంటాయో  తెలీదుగానీ… ప్ర‌స్తుతానికి  డీజే శాటిలైట్ రైట్స్ మాత్రం హాట్ కేకులా అమ్ముడుపోయింది. జీ తెలుగు డీజే శాటిలైట్ రైట్స్‌ని 10 కోట్లు పైగా పెట్టి  సినిమా ను  కొన్నారు  అని  తెలుస్తోంది. బ‌న్నీ కెరీర్‌లో ఇదే రికార్డు ధ‌ర అట దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకొన్న డీజే  ఈ వేస‌విలో బాక్సాఫీసు బ‌రిలో దిగ‌బోతోంది.

]]>