అడుగేసేముందే ఆలోచిస్తే అలాఅయ్యేది కాదేమో ..

ఒక్కసారి మోసపోతే అది తలరాత అమాయకత్వం అనుకోవచ్చు కానీ అవగాహనా లేక మరోపొరపాటు చేస్తే దాన్నేమనాలో ప్రత్యేకం గా చెప్పే అవసరం లేదు ..

పెద్దల సమక్షo లో జరిగిన పెళ్లిళ్లే ఐనా ఒకరినొకరు నమ్మే పరిస్థితి లేదు ఇప్పటి సమాజం లోరోజుల్లేవేమోఅనిపిస్తుందికొందర్నిచూస్తేనమ్మి మోసపోవడం ఆ తర్వాత …మానసికంగా,శారీరకంగా,అన్ని విదాలుగా ఇలా బాద పడటం కంటే అడుగేసే ముందే ఆడైనా మగైనా కాస్త అలోచించి నిర్ణయం తీసుకుంటే బావుంటుంది.నమ్మి  మోసపోయిన మహిళా బాధితురాలి సమస్య ఇది హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఘటన ఇది ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది.ఒక పాప కొంత కాలం తర్వాత  భార్య భర్తల మధ్య గొడవలు ఎక్కువవ్వడం తో విడాకులు తీసుకున్నారు.

ఆమె సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అక్కడే పనిచేసే ఒకరు స్నేహం పేరుతో ఆమెకు పరిచయమయ్యారు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ‘నీవు బాధలో ఉన్నావు.. గతం గురించి మర్చిపో.. నీవెంట నేనున్నాను..పాపను అల్లారుముద్దుగా చూసుకుంటా’ అని ధైర్యం చెప్పాడు. మంచి వ్యక్తిగా భావించిన ఆమె అతడి ప్రేమను అంగీకరించింది.కలిసుందామని కొంత సొమ్ము కూడా ఆమె నుంచి తీసుకున్నాడు కొన్నాళ్ళు కలిసున్నారు తర్వాత అతడి అసలు రూపం బయటపడింది. పడక గదిలోని దృశ్యాలను కెమెరాలో బంధించాడు. స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. తర్వాత ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఎందుకు దూరం పెడుతున్నావని బాధితురాలు ప్రశ్నించగా.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అశ్లీల చిత్రాలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు.

ఆత్మహత్య చేసుకోవాలనుకుంది విషయం తెలిసిన స్నేహితులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షీటీమ్స్‌ సహాయంతో సదరు వ్యక్తిని  సైబర్‌ పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

]]>