ఎలుకల కు మద్యపాన నిషేధం లేదు తెలుసా…..

మద్యపాన నిషేదం మనుషుల కు మాత్రమే మాకు కాదు అంటున్నాయి ఎలుకలు వినడానికే విచిత్రంగా ఉన్న ఇది నిజం.బీహార్ సర్కారు మద్య నిషేధం విదించింది. అయితే ఆ నిషేధం మనుషులకే కానీ తమకు కాదనుకున్నాయి ఎలుకలు.అంతే ఇష్టం వచ్చినంత లిక్కర్ ను తాగేస్తున్నాయి.గతేడాది నుంచి బీహార్ లో మద్య నిషేధం కొనసాగుతోంది. దీంతో ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ యంత్రాంగం మద్యం తయారీ కేంద్రాలపై దాడులు చేశారు.ఈ క్రమంలో పెద్ద మొత్తంలో మద్యాన్ని ధ్వంసం చేశారు. కొంత స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్ గోదాముల్లోకి తరలించారు.దాదాపు 9 లక్షల లీటర్ల మద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ లోని గోదాముల్లో భద్రపరిచారు. ఇందుకు సంబంధించి ఇటీవల అధికారులు లెక్కలు తీయగా ఆ మద్యం మాయమైందని అధికారులు బదులిచ్చారు. దీనికి కారణం ఎలుకల బెడదేనని… అవి ఉన్న మందంతా తాగేశాయని చెప్పేశారు.దీంతో బిత్తరపోయిన ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అదనపు డీజీపీ ఎస్‌కే సింఘాల్.అయితే ఇప్పుడు ఏ ఎలుకల మీద కేసు లు పెట్టి సిక్షిస్తారో……వేచి చూడాలి.

]]>