తెలుగు రాష్ట్రాలను వేరుగా చుడోద్దు…..పవన్

రెండు తెలుగు రాష్ట్రాల లో రైతు కష్టం ఒకటే,రెండు రాష్ట్రాలను వేరుగా చూడొద్దు.రెండు తెలుగు రాష్ట్రాలు సమానం అంటూ కేంద్రంలో ఉన్న బీజేపీ మిర్చి కొనుగోలులో వివక్ష చూపడం తగదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌. రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వాలు ఆదుకోవాలి కానీ, తప్పించుకోకూడదని వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తలకు కోట్లు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వాలు. రైతులపై ఎందుకు కరుణ చూపడం లేదని పవన్ ప్రశ్నించారు.ఏపీలో 88, 300 మెట్రిక్ టన్నులు కొంటున్న కేంద్ర ప్రభుత్వం.తెలంగాణలో 33, 700 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తామనడం సబబు కాదన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూడాలన్న పవన్.తెలుగు రాష్ట్రాల మధ్య తగువులు పెట్టవద్దని కోరారు.తెలంగాణ రైతుల వద్ద ఇంకా లక్షల టన్నుల సరుకు ఉందన్న సంగతి పాలకులు గమనించాలని పవన్ సూచించారు.రెండు రాష్ట్రాల్లోనూ మద్దతు ధరను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన పవన్ తెలంగాణలోనూ 88, 300 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలన్నారు.

]]>