ప్రకాష్ రాజ్ తమిళ రాజకీయ వ్యవస్థ గురించి టీవీ చానల్ ఇంటర్ వ్యూ లో మాట్లాడారు,జయలలిత మరణం తర్వాత రాజకీయ,ప్రభుత్వ వ్యవస్థ ప్రశ్నర్ధకం గా మారిందని,అందరికి మాట్లాడే దైర్యం వచ్చిందని,ఇప్పటికిప్పుడు నాయకుడిని ఎలా ఎన్నుకుంటారని వారిని ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకోలేదని,కచ్చితంగా ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న వ్యక్తులే 5 సంవత్సరాలు పరిపాలన చేయాలనీ,ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వం కాబట్టే ఇప్పటి ప్రభుత్వం ప్రశ్నర్ధకం గా మారింది అన్నారు.
జల్లికట్టు ఉద్యమాన్ని యువత శాంతి యుతంగా పోరాడారని.ఆ శాంతి యుత పోరాటానికి తాము కూడా మద్దతు పలికామన్నారు.పోలీస్ లు దానిని హింస తో కూడుకున్నది గా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.
ప్రకాష్ రాజ్ నటుడు విశాల్‌తో కలిసి తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయనున్నారన్నది గమనార్హం.రెండు రోజుల క్రితం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద పోరాటం చేస్తున్న తమిళ రైతులను కలిసి వారికి మద్దతు తెలిపిన నిర్మాతల బృందం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని, కేంద్ర మంత్రులను కలిసి రైతులు కరువు భారిన పది అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారాని,వారి డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా కోరుకుంటున్నాం అన్నారు.
]]>