చిన్న పిల్లలు అంటే బొమ్మలు బొమ్మలు అంటే చిన్న పిల్లలు.వీరిద్దరి మధ్య విడదీయరాని బంధం టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆపిల్లలు ఆడుకునే బొమ్మల్లో కూడా మార్పులు వచ్చాయి.చెక్క,ప్లాస్టిక్ బొమ్మలతో ఆడటం మానేశారు.స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ లలో ఆడటం మొదలు పెట్టారు,ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎక్కువ మైగ్రేట్ అయ్యారు,పిల్లల ఆకర్షణకు తగట్టు పలు కంపెనీలు కొత్త గేమ్స్,తయారు చేస్తున్నాయి.ఈ బొమ్మల కోసం ప్రత్యేకం గా యాప్స్ ఉన్నాయి.
యాప్స్ లో ని బొమ్మ లు మనుషులతో మాట్లాడుతున్నాయట ఇదే సందు అనుకున్న సైబర్ నేరగాళ్లకు .దీనిని అవకాశం గా తీసుకొని హ్యాక్ చేయడం మొదలుపెట్టారట.ప్రధానంగా అమెరికా నుంచి ఆ దేశానికి దిగుమతి అవుతున్న ‘మై ఫ్రెండ్ కేలా’ అనే బొమ్మను మంచి టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసారు.
నేరగాళ్లు ఈ బొమ్మలను ఉపయోగిస్తున్న పిల్లల దగ్గర్నుంచి సమాచారం సేకరిస్తున్నారట.చిన్నారుల కదలికలను, మాటల్ని గమనిస్తున్నారట.ఈ బొమ్మలు ఎక్కువగా యూరప్ దేశాల్లో అమ్ముడుపోతున్నాయి.ఈ బొమ్మ ఏం ప్రశ్న అడిగినా ఇంటర్నెట్ సాయంతో జవాబు ఇచ్చేస్తుంది.చిన్నారుల కదలికలతో పాటు.ఇంట్లో మాట్లాడుకునే మాటలను నేరగాళ్లు వింటున్నారట.ఇలానే కొనసాగితే నేరాలు ఎక్కువై పోతాయని గ్రహించిన జర్మనీ ప్రభుత్వం.వెంటనే స్పందించి వాటిని ప్రజలు ఉపయోగించకూడదని, వ్యాపారస్థులు ఇకపై అమ్మకూడదని, తమ ఆదేశాలను పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది
]]>