నగరం లో జోరుగా మత్తు దందా….

హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా మత్తు ఇంజక్షన్ల దందా జోరుగా సాగుతోంది. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు ఇంజెక్షన్లను తెచ్చి విక్రయాలు జరుపుతూ… యువతను మత్తుకు బానిసచేస్తోంది. మెడికల్ షాపుల్లో ఆరు రూపాయలకు కొనుగోలు చేసిన టీకాలను.. రూ. 300 రూపాయలకు విక్రయిస్తున్నట్టు తేల్చారు పోలీసులు. కామటిపురా ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు… మత్తు ముఠాను అదుపులోకి తీసుకున్నారు.మరో 10 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేని 17 బైకులు, 7 ఆటోలను సీజ్ చేశారు.

]]>