నకిలీ ఆధార్ వెబ్ సైట్స్ తో జర భద్రం..డూప్ సైట్స్ ఇవే

డిజిటలైజేషన్  లో భాగం ల విశిష్ట సంఖ్య విధానాన్ని దేశంలో తీసుకొస్తూ మెల్లిగా ప్రజల్ని నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడేలా చేస్తోంది ప్రభుత్వం ఐతే ఇప్పటికే ఆధార్ నెంబర్ ని అన్నిటికి లింక్ చేస్తూ ఆర్ధిక నేరాల్ని అరికట్టే క్రమం లో ఈ విధానాన్ని పకడ్బందీగా అమలయ్యేనా చర్యలు తీసుకొంతోంది. ఇదిలా ఉండగా ఇందుగలడందు లేదనే ప్రహ్లదుని భక్తి లాగా ఆధార్ ని కూడా వదల్లేదు నకిలీ బెడద , పుట్టగొడుగుల్లా వెబ్సైట్ పుట్టుకొచ్చేశాయి,దీనితో ప్రభుత్వం వీటికి చెక్ పెట్టాలని భావించి కొరడా ఝుళిపించింధి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDIA). ఆధార్‌ పేరుతో చాలా వెబ్ సైట్లు ఇంటర్నెట్ లో ఉండడంతో ఏదీ అధికారిక వెబ్ సైటో తెలియక  మోసపోయామని అనేక ఫిర్యాదులు అందాయి.

నకిలీ వెబ్ సైట్లపై చర్యలకు సిద్ధమైంది యూఐడీఐఏ. చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి ఆధార్‌నంబర్, ఎన్‌రోల్‌మెంట్‌ డాటాను సేకరిస్తున్న 8 అనధికార వెబ్‌సైట్లపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కేసు నమోదు చేసింది. ప్రజలను ఆధార్ సిబ్బంది పేరుతో మోసం చేస్తున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. నకిలీ మోసగాళ్లు ఇకపై మూడేళ్ల జైలు శిక్షతోపాటు.. రూ. 10 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుందని అధికారిక వెబ్‌సైట్‌ ( www. uidai. gov. in).

నకిలీ ఆధార్ వెబ్ సైట్లు ఇవే.. aadhaarupdate. com aadhaarindia. com pvcaadhaar. in aadhaarprinters. com geteaadhaar. com downloadaadhaarcard. in aadharcopy. in duplicateaadharcard. com  ]]>