"16"తెలుగు రాష్ట్రాలలో దూసుకుపోతోంది…

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై `ధురువంగ‌ల్ ప‌దినారు` తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్‌` పేరుతోరీమేక్ చేసిన చిత్రం మార్చి 10న రిలీజ‌ైంది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల లో దూసుకుపోతోంది.త్రిల్లర్ మరియు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటున్న ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది.హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ ఇదేనని ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్, అర‌వింద‌స్వామి, మంచు మ‌నోజ్ వంటి ప్ర‌ముఖులు ప్ర‌శంసించ‌డంతో ఈ సినిమాను ఇండస్ట్రీలో సైతం ఎలాంటి ప్రభావితం చేసిందో అర్థమౌతోంది. త‌మిళులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన‌ట్టే తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. తెలుగులో అన్నివార్గాల‌ ప్రేక్ష‌కుల్ని మెప్పించే చిత్ర‌మిది`అన్నారు.

]]>