'ఓం నమో వేంకటేశాయ" మంత్రి గారినోట

భారతీయులంతా చూడాల్సిన చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ అంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. నిన్న రాత్రి వెంకయ్యనాయుడు కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఈ చిత్రం చూస్తుంటే ఎన్టీఆర్ నటించిన నాటి ‘లవకుశ’ చిత్రం గుర్తుకు వచ్చిందని ఆయన అన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి నేటితరం దర్శకులు నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారు.

అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి చిత్రాల తర్వాత అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావుల కలయికలో రూపొందిన మరో భక్తిరస కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. తిరుమల వెంకటేశ్వరుడి పరమ భక్తుడు హథీరాం బావాజీ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడవలసిన చిత్రం అని మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

]]>