ఎక్స్ ప్రెస్ టీవీ ఉద్యోగులు పెన్ డౌన్ చేయడంతో ప్రసారాలు ఆగిపోయాయి. కార్యాలయంలోనే ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. యాజమాన్యం స్పందించకపోవడంతో..అరకొరగా వస్తున్న బులెటిన్లు కూడా ఆగిపోయాయి. ఉద్యోగులకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగులకు న్యాయం చేసేందుకు యాజమాన్యంతో నేతలు చర్చలు జరిపారు. అయినా మేనేజ్ మెంట్ ..జీతాలు చెల్లిస్తాం..అంటోంది తప్పించి..చెల్లించడంలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. టీయూడబ్ల్యుజే నేతలు ఉద్యోగుల పక్షాన నిలవడంతో తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో వున్నారు.
కొన్ని నెలల క్రితం కూడా ఎక్స్ ప్రెస్ టీవీలో ఉద్యోగులు జీతాల కోసం నిరసనకు దిగారు. అప్పట్లో మూడు నెలలుగా జీతాలు పెండింగ్ పెట్టారు. దీనిపై ఉద్యోగులు నిలదీస్తే.,.యాజమాన్యం దిక్కున్న చోట చెప్పుకోమని తెగేసి చెప్పిందట. జీతాలు ఇవ్వకపోగా, ఆందోళనకు దిగిన 35మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారట. దీంతో ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నెలంతా పనిచేస్తే..జీతాలు ఇవ్వకపోగా తిరిగి తమనే బ్లాక్ మెయిల్ చేయడంపై ఎంప్లాయీస్ తీవ్ర ఆగ్రహంగా వున్నారు.
ఈ వివాదం సద్దుమణిగాక, కొందరు ఉద్యోగులు ఇతర చోట్ల జాబ్‌లు చూసుకున్నారు. మళ్లీ జీతాల సమస్య మొదటికొచ్చింది. ఈ సారి యాజమాన్యాన్ని నిలదీస్తున్న ఉద్యోగులకు టీయూడబ్ల్యుజే అండగా నిలవడం, సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే కొండంత ఆశతో వున్నారు ఉద్యోగులు. ఇది ఒక చానల్ యజమాని నిర్వాకం అనుకుంటే పొరపాటే..ఒకరినొకరు స్పూర్తిగా తీసుకుని ఒక్కో యాజమాన్యం ఉద్యోగులు, జర్నలిస్టుల జీతాలు ఎగవేసే ప్లాన్లతో ముందుకొస్తున్నాయి. దీనికి ఎక్కడో ఓ చోట చెక్ పడకపోతే..జర్నలిస్టులు జీవితాలు నడిరోడ్డున పడటం ఖాయం
]]>