ఇక హిందు పండుగల వంతట తెలంగాణాలో

ధనికుడికి ప్రతి రోజు పండుగే వారు ఎప్పుడంటే అప్పుడు కావాల్సిన తిండి,కావాల్సిన బట్టలు కొనుకుంటారు కానీ పేదవాడు మాత్రం ఏ పండుగకో ఒక్క జత కొనుకుంటాడు.అసలు పండుగలు ఉన్నదే పేదవాడు ఒక్క రోజైన సంతోషం గా ఉండటం కోసం.ఆ పేద వాడిని సంతోష పరచడం కోసం తెలంగాణా ప్రభుత్వం కొత్త పథకాన్ని చేపట్టింది.ప్రతి ఒక్క పేదవాడికి హిందువుల పండుగలకు కొత్త బట్టలు ఇవ్వనుంది.

దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని హిందువుల్లోని పేదలకు కొత్త బట్టలు పంపిణీ చేయనుంది.హన్మకొండ, జనగామలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో మంత్రి హరీశ్ రావు ఈ ప్రకటనచేశారు.ఇంతకుముందు పండుగలకు ముస్లింలు, క్రైస్తవులకు ప్రభుత్వం దుస్తులు ఇస్తున్నట్లుగానే.హిందువుల్లోని పేదలకు కూడా ఇక నుంచి దసరా, దీపావళికి దుస్తులున్న ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే దసరా నుంచే అమలు చేయనున్నారు.పురుషులకు పంచె, కండువ, మహిళలకు చీర ఇవ్వనున్నారు. చేనేత దుస్తులను పంపిణీ చేయడం ద్వారా చేనేత కళాకారులకు కూడా మరింత ఉపాధి కల్పించినట్లు అవుతుందని భావిస్తోంది ప్రభుత్వం.

]]>