సాయి పల్లవి లుక్ తో"ఫిదా"అవాల్సిందే….

ప్రేమమ్‌’తో ఎంతోమంది కుర్రహీరోల మనసు దోచుకున్న ‘మలార్‌’ సాయిపల్లవి.ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ తో జత కట్టి ‘ఫిదా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ క్లైమాక్స్‌కు రాగా ఈ రోజు సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌.అందులో లంగా ఓణీతో పల్లెటూరి అమ్మాయిలా అందరినీ ఆకట్టుకుంటుంది సాయి పల్లవి.ఎన్నారై అబ్బాయి-తెలంగాణ అమ్మాయిల మధ్య ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించగా దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు.

]]>