ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం…..

జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది.మూడవ అంతస్తు లో ప్రమాదం జరిగింది.షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు.ఉదయం ఈ ప్రమాదం జరిగింది.ఆంద్ర జ్యోతి సిబ్బంది క్షేమం,ఆఫీస్ ఫైల్స్ మాత్రం మొత్తం తగలబడ్డాయి.అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.ప్రమాదంలో ఎంత మేర నష్టం సంభవించిందీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

]]>