ఎవరేమైతే నాకేంటి అనుకున్నడేమో,అతను కూడా ఆపదలో ఉన్న అన్న సంగతి మర్చిపోయి,ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అన్న సమేత గుర్తోచిందో….కాని బెడ్ కనపడగానే నడిపే విమానాన్ని వదిలి వెళ్ళి హాయిగా రెండు గంటల సేపు పడుకున్నాడు పైలెట్ అమిర్ అఖ్తర్ హంషీ.ఈయన పాక్కు చెందిన సీనియర్ పైలెట్.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 305మంది ప్రాణాలను గాలి కొదిలేసి వెళ్ళి పడుకున్నాడు.
టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానాన్ని ట్రెయినీ పైలట్లకు వదిలేసి ఏం చక్కా వెళ్లి బిజినెస్ క్లాస్లో గుర్రుమంటూ నిద్రపోయాడు.ఈ విషయం ఓ ప్రయాణీకుడి ద్వారా వెలుగు చూసింది.అక్కడే ఉన్న ఓ ప్రయాణీకుడు అతడు నిద్ర పోతున్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతోపాటు అతడిపై విమానయాన అధికారులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హల్ చల్ అవుతున్నాయి. ఏప్రిల్ 26న ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పాక్ అధికారులు విచారణకు ఆదేశించారు.
]]>