మామిడి రారాజు ..ఆంధ్రకే అందుకో తెలుసా

ఎక్కువ మంది ఇష్టపడే పండు మామిడి పండు.రుచుల యందు మామిడి పండు రుచే వేరయా….అంటూ తిన్నవారు కవిత్వాలు చెప్పక మానరు.అలంటి మామిడి పండ్ల రారాజు అయిన బంగినపల్లి రకానికి అరుదైన గుర్తింపు లభించింది.70 శాతానికి పైగా పంట దిగుబడితో అగ్రస్థానంలో ఉన్న బంగినపల్లి మామిడికి పండుకు జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ (GI) దక్కింది. చెన్నైలోని జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ రిజిస్ట్రీ దీన్ని జారీ చేసింది. దీంతో బంగిన పల్లి రకం మామిడిపండుపై హక్కులన్నీ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభత్వానికి దక్కాయి.

కర్నూల్‌ జిల్లాలోని బనగానపల్లి ప్రాంతంలో వందేళ్ళ క్రితం తొలిసారిగా దీన్ని పండించారు.కర్నూల్‌ జిల్లా తో పాటు కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఇది పండుతోంది.అలాగే తెలంగాణాలోని ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, అదిలాబాద్‌ జిల్లాల్లో కూడా బంగినపల్లి మామిడి విస్తారంగా సాగౌతోంది. 2011లోనే దీనికి సంబంధించి పూర్తి హక్కుల కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవనశాఖ కమిషనర్‌ రాణికుముదిని దరఖాస్తు చేశారు. అయితే యుఎస్‌, యుకెలు కూడా తమ ప్రాంతంలోనూ ఈ రకం మామిడి సాగౌతున్నట్లు కొన్ని అభ్యంతరాల్ని వ్యక్తం చేశాయి. వాస్తవానికి అక్కడ కూడా బంగినపల్లి సాగవుతున్నా.. భారత్‌ నుంచే ఏటా 5500టన్నులకు పైగా ఈ దేశాలకు ఎగుమతౌతున్నాయి. గతేడాది మన దేశంలో బంగినపల్లి విక్రయాలు 1461కోట్లకు చేరుకున్నాయి. ఈ స్థాయిలో దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న బంగినపల్లి రకం మామిడిపై పూర్తి హక్కులు ఏపీకి దక్కడంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

.

.

]]>