గ్యాస్ లీక్ అయ్యి 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత…

ఢిల్లీలోని ఓ పాఠశాల సమీపంలో భారీగా గ్యాస్ లీకేజ్….దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లోని రైల్వే కాలనీ సమీపంలో కంటేనర్ డిపో నుంచి గ్యాస్ లీక్ అయింది. పక్కన ఉన్న రాణి ఝాన్సీ సర్వోదయ కన్యా విద్యాలయ ప్రభుత్వ పాఠశాలలోకి ఈ గ్యాస్ వ్యాపించంది. ఈ గ్యాస్ పీల్చడంతో 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించింది. మిగతా విద్యార్థులను కూడా స్కూల్ నుంచి బయటకు పంపివేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రిలో పరామర్శించారు.డాక్టర్లను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న వారు ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని జిల్లా మెజిస్ట్రేట్‌ను ఆదేశించారు.

]]>